అయోధ్య రామ మందిరం నిర్మాణం | బాల రాముని ప్రాణ ప్రతిష్టాపన | ఉత్తర ప్రదేశ్ రామ మందిరం అయోధ్య

అయోధ్య పేరు వినగానే అందరికీ రామ జన్మభూమి అని అందరికీ తెలిసిన విషయమే కానీ 2024 జనవరి 22 వ తేదీన బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ అయోధ్యలో గుడిలో జరిగింది. దీనికి ఇంతటి విశిష్టత ఎంటి అంటే 500 సం"ల హిందువుల కళ మరియు త్రేతా యుగంలో శ్రీరాముడి బాల్యం అంతా ఈ అయ్యోధ్య లోనే గడిపారు .కావున హిందువులు ఆ స్థలాన్ని శ్రీరాముని జన్మ భూమి అత్యంత పవిత్ర స్థలంగా భావిస్తారు. హిందువులకు మరియు ముస్లింలకు కొన్ని వందల సంవత్సరాలుగా ఆ స్థలం లో ఉన్న  బాబ్రీ మసీదు కూల్చివేత కారణం వల్ల ఆ స్థలం మకే చెందుతుందని లేదు.. లేదు... మా శ్రీరాముడు జన్మించిన భూమి కారణంగా మరియు పూర్వ కాలం అక్కడ రామ మందిరము ఉండేదని ఆ ప్రదేశమంతా మది అని గొడవలు మొదయ్యాయి.
అయోధ్య రామ మందిరం


ప్రస్తుత కథ 

ఉత్తర ప్రదేశ్ లోని ప్రస్తుత అయోధ్య లో రామ మందిరం నిర్మాణంలో ఉంది. ఇందులో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ 22 జనవరి 2024న మధ్యాహ్నం 12:29 గంటలకు 90 నిమిషాల శుభ సమయంలో జరిగింది. బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ శ్రీ రాముడి బాల రూపంలో విగ్రహం ప్రతిష్టించారు అయితే శ్రీరాముడిని రామ్ లాల్లా అనే పేరుతో కొలుస్తారు. 2019లో, భారత సర్వోన్నత న్యాయస్థానం వివాదాస్పద భూమిపై తీర్పునిచ్చింది , ఆ 2.7 ఎకరాల భూమి హిందువులకు చెందినదని మరియు దానిపై రామమందిరాన్ని నిర్మించవచ్చని పేర్కొంది. మసీదు నిర్మించుకోవడానికి ముస్లింలకు ప్రత్యేక 5 ఎకరాల భూమి ఇస్తారు. కూల్చివేసిన బాబ్రీ మసీదు కింద ఇస్లామేతర నిర్మాణం ఉన్నట్లు సూచించే సాక్ష్యాలను ఉదహరిస్తూ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదికను కోర్టు సాక్ష్యంగా పేర్కొంది . ఈ అయోధ్య రామ మందిరం నిర్మాణ వాస్తుశిల్పి సోంపురా కుటుంబంనికి చెందిన చంద్రకాంత్ సోంపురా, నిఖిల్ సోంపురా మరియు ఆశిష్ సోంపురా వారు రామ మందిరం నిర్మాణానికి గుడి లక్ష్య రేఖలు గీశారు . ఈ కార్య్రమానికి మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.


 
                             

రామ్ లల్లా రూపంలో దర్శనం ఇస్తున్న శ్రీ రామచంద్రుడు


రామ్ లల్లా విగ్రహ శిల్పి:

 శ్రీరాముడి విగ్రహన్ని రామ్ లల్లా విగ్రహ రూపంలో చెక్కింది అరుణ్ యోగిరాజ్ ఇతడు మైసూర్ కి చెందిన శిల్పి . రామ్ లల్లా విగ్రహం చెక్కడం నేను ఇప్పుడు భూమిపై అత్యంత అదృష్టవంతుడిని అని భావిస్తున్నాను. అని అరుణ్ యోగిరాజ్ పేర్కొన్నారు.

 
                                                 

అరుణ్ యోగిరజ్ 






                   

Comments

Popular posts from this blog

RRB 2025 PARAMEDICAL RESPONSE SHEET IS OUT 👇 LINK BELOW WAIT FOR ACTIVE

భయం - మొదటి భాగం -1